కారు ట్రైల్ వేస్తానని నమ్మబలికి కారుతో సహా ఉడాయించిన దుండగుడు. OLX ఆన్ లైన్ లో కారు అమ్మకానికి పెట్టి మోసపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం పల్లేవాడ గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన చాట్ల వంశీ కృష్ణ అనే యువకుడు ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగం లేకపోవడంతో కారు నడుపుకుంటూ జీవనం సాగించాలని ఫైనాన్స్ లో కారు కొన్నాడు. మూడు నెలలు గడిచాక కారు కిస్థిలు కట్టలేక ఫైనాన్స్ వాళ్లకు సమాధానం చెప్పలేక కారు అమ్మైనా అప్పు తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడు. విద్యావంతుడు కావడంతో కారు అమ్మకాన్ని OLX ఆన్ లైన్ యాఫ్ లో పోస్ట్ పెట్టాడు. అదే అతను చేసిన తప్పు.
నేరాలకు పాల్పడే అనుభవం ఉన్న ఆంధ్రాలోని దుర్గారావు అనే యువకుడు OLX లో కారును చూసి చోరీ చెయ్యాలని ప్లాన్ వేసాడు. వంశీ కృష్ణ కు కాల్ చేసి తాను కారు కొనుగోలు చేస్తానని, అందుకు కారును ముందుగా ఒకసారి ట్రైల్ వేసి కండిషన్ చూసి కొంటాను అని నమ్మబలికాడు. దీంతో అమాయకుడు వంశీ కృష్ణ తన కారును ట్రైల్ వేసేందుకు కారు ఇచ్చాడు. అంతే ఇదే అదునుగా భావించిన దుండగుడు కారుతో సహా ఉడాయించాడు. ట్రైల్ కి వెళ్ళిన కారు ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో తన కారు దొంగిలించబడిందని ఆలస్యంగా పసిగట్టాడు. ఇంకేముంది గత మూడు నెలలు గా కారు ఎత్తుకెళ్లిన దుండగుడు దుర్గారావు కోసం గాలించి వేసాగిన బాధితుడు వేరే దారిలేక తనకు న్యాయం చేయాలంటూ వేంసూరు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Swine Flu Cases In Adilabad: కలవరపెడుతున్న స్వైన్ ఫ్లూ.. మూడుకు చేరిన కేసుల సంఖ్య
