NTV Telugu Site icon

Missing Mother: తప్పిపోయిన తల్లి.. నాలుగేళ్ల తరువాత కుమారుల వద్దకు చేర్చిన జవాన్

Missing Mother

Missing Mother

Missing mother in Jogulamba Gadwal: తప్పిపోయిన తల్లికోసం గాలించారు. ఎన్నిచోట్లు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో.. ఆశలు వదులుకున్నారు. నాగేళ్లుగా ఆతల్లిని తలుచుకుంటూనే బతికారు. ఎక్కడవుందో, ఏంచేస్తుందో అనుకుంటూ కాలం పడిపారు. తల్లి ఆచూకి లభ్యం అవుతుంది అనే చిన్న ఆశతో బతుకున్న వారికి ఓ జవాన్‌ శుభవార్త చెప్పాడు. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ.. కుటుంబసభ్యుల్లో ఆనందాన్ని నింపాడు.

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తిరావులచెర్వు గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మకు మతిస్థిమితం లేదు. నాగేశ్వరమ్మకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, భర్త జమ్మన్నతోపాటు కుమారులతో కలిసి ఉంటోంది. ఆమెకు మానసిక స్థైర్యం లేకపోవడంతో తరచూ ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చేది. ఒకరోజు నాగేశ్వరమ్మ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అయితే.. ఆమె భర్త ఫిబ్రవరి 2019లో మృతిచెందాడు. తండ్రి మరణం తర్వాత కొడుకులు తల్లి జాడ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఆశవదులుకున్న ఆకుటుంబానికి రెండు రోజుల క్రితం భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అస్సాంలోని ఓ ఆశ్రమంలో నాగేశమ్మ కనిపించినట్లు సమాచారం రావడంతో కుటుంబంలో ఆవార్త సంతోషాన్ని నింపింది.

Read also: Earth is Flat not Round: భూమి గుండ్రంగా లేదు..!

ఏపీకి చెందిన ఓ జవాన్ ఆమెను గుర్తించి హైదరాబాద్‌లోని ఆమెకు తెలిసిన వారికి సమాచారం అందించాడు. వారు పోలీసులకు చెప్పడంతో నాగేశమ్మ కుమారులకు ఫోన్ చేసి తల్లి గురించి చెప్పారు. పోలీసులు చూపిన ఫోటోలో తల్లిని గుర్తించిన పెద్ద కుమారుడు వెంకటన్న ఆమె వద్దకు వెళ్లాడు.అసోంలోని క్యాచర్ జిల్లా ఉత్తర బారిక్‌నగర్‌లోని వృద్ధాశ్రమంలో నాగేశమ్మతో భావోద్వేగానికి గురయ్యాడు. తల్లిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయిన కొడుకులు కొన్నాళ్లుగా ఆమె ఆచూకీ కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆశలు వదులుకున్నామని తెలిపారు. ఇప్పుడు తిరిగి రావడం పట్ల కుమారులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తుసారు.
Maa Robot: దివ్యాంగులైన కుమార్తె కోసం దినసరి కూలీ సరికొత్త ఆవిష్కరణ