Site icon NTV Telugu

The Son Killed the Mother: దారుణం.. తల్లిని కడతేర్చిన కుమారుడు.. ఎలాగంటే..?

The Son Killed The Mother

The Son Killed The Mother

నవమాసాలు మోసీ కడుపున పెట్టుకుని తను తిన్న తినకపోయిన తన పిల్లలు తింటే తన కడుపు నిండుతుందని అనుకొనేది ఒక్క అమ్మ మాత్రమే. తను ఎంతగా అల్లరి చేసిన తన గుండెలమీద తన్నినా ఆనందాన్ని పొందుతుంది. ఎవరైనా తన పిల్లల గురించి తప్పుగా చెప్పిన వారితో వాదిస్తుంది. మనకంటూ ఒకతోడు నీడగా వుంటుంది. జీవనశైలి, విద్యాబుద్ధులు, నడవడిక, మనకు కావాల్సింది మనకు ఇచ్చేంత వరకు ఆమె కంట కునులేకుండా కష్టపడుతుంది. ఒకప్పుడు తల్లి అంటే గౌరవం, తల్లి గోరుముద్దలే కడుపు నింపేవి. కానీ ఆతల్లి ఈకాలంలో భారమైంది. కొందరు ఆస్తి కోసం దూరం చేసుకుంటున్నారు. మనకు కంటికి రెప్పలా కాపాడిన ఆతల్లిని గొంతునొక్కే పరిస్థితి దిగజారుతున్నాం. తల్లితో గొడవ పడిన ఆరాక్షస కొడుకు ఆతల్లినే గొంతునుమిలి హతమార్చాడు. కడుపున పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడిన ఆతల్లిని కాలయముడులా తయారయ్యాడు. ఇక ఆతల్లికి స్వాస ఆడక చివరికి ప్రాణాలు వదిలింది. ఇలాంటి దారుణమైన ఘటన మన భాగ్యనరగంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌ లోని చాత్రినక పోలీస్ స్టేషన్ లిమిట్ లోని ఉప్పుగుడా శివాజీ నగర్ లో నివసించే ఛానవంత్ రుక్కమ్మ, కన్న కొడుకు ప్రవీణ్ కుమార్ నివాసం ఉంటున్నారు. బతువు తెరువు కోసం బ్యాండ్ మేళం వాయించే వాడు కుమారుడు. రోజూలాగానే బయటకు వెళ్లి వచ్చిన గేరు నాయక్‌ నిన్న రాత్రి ఓవిషయమై తల్లి తో గొడవ పడ్డాడు. మాటమాట పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన గేరునాయక్‌ తల్లి అనికూడ చూడకుండా కిరాతకంగా హతమార్చాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఫలకానుమ ఎసిపి షేక్ జహంగీర్, చత్రినకా ఇన్స్పెక్టర్ ఖాదర్ జిలానీ , నైట్ ఆఫీసర్ చంద్రయాంగుట్టా ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, క్లూస్ టీమ్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే మృతి చెందిన రుక్కమ్మను గొంతు నుమిలి హత్యచేసినట్లు ఆనవాల్లు ఉన్నయని అనుమానం వ్యక్తం చేసారు పోలీసులు.
Sai baba Parayanam For good Health Live: శ్రావణ గురువారం సాయి చాలీసా వింటే..

Exit mobile version