Site icon NTV Telugu

Raghunandan Rao: కేంద్ర ప్రభుత్వ పాలసీని అధికార పార్టీ నేతలు అర్థం చేసుకోవాలి

Raghunandanrao

Raghunandanrao

Raghunandan Rao: కేంద్ర ప్రభుత్వ పాలసీని అధికార పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సభలో గవర్నర్ ప్రసంగంపై చాలా చర్చ జరిగిందని అన్నారు. కానీ ఉత్కంఠ కు తెరదించుతూ సభలో గవర్నర్ ప్రసంగించిందని అన్నారు. చాలా సీనియర్ లు అన్ని చెప్పుకునే కొందరు.. గవర్నర్ ప్రసంగానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందా అని ప్రశ్నించారని తెలిపారు. కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాకరిస్తుంది కాబట్టే.. గవర్నర్ స్పీచ్ లో కేంద్రాన్ని విమర్శించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీని అధికార పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని రఘునందన్‌ రావు అన్నారు.

Read also: MLA Jaggareddy: నేను స్పీచ్ రాసుకుని వచ్చా.. ఆయన మాట్లాడితే మర్చిపోయా

గతంలోనే తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసారని, కాబట్టి లేని చోట పెట్టాలనేది కేంద్రం ఆలోచనలో ఉందని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ చేర్చి ఉంటే బాగుండేదని తెలిపారు. 3 ఫేజ్ కరెంటు 24 ఇవ్వడం లేదని విద్యుత్ శాఖ ప్రకటించింది కానీ.. 24గంటల కరెంటు ఇస్తున్నామని అధికార పార్టీ నేతలు చెప్తున్నారని రఘునందన్‌ రావు అన్నారు. నిరుద్యోగ బృతి అమలుపై గవర్నర్ ప్రసంగంలో చేర్చాల్సిఉండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ఏసీడీపీ నిధులను ఇంఛార్జి మంత్రులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. మల్లన్న సాగర్ లో చేపలు పట్టుకునేందుకు మత్సకారుల కు పర్మిషన్ ఇస్తలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. దలితబంధు లబ్దిదారుల ఎంపికలో నిర్ణయం ఎవరిదో స్పష్టంగా చెప్పాలని అన్నారు. బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌ రావ్‌ అన్నారు.
MLC Kavitha: మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే

Exit mobile version