NTV Telugu Site icon

శిథిలావస్థకు చేరిన ప్రభుత్వాసుపత్రి… భయంభయంగా చికిత్స

ప్రభుత్వాసుపత్రి శిథిలావస్థకు చేరుకోవటంతో ఆ మండలంలోని గ్రామాలు ఆందోళన చెందుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం, కుందారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవలే కురిసిన వర్షాలకు కూలిపోయే దశలో వుంది. దీని మరమ్మతులకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆసుపత్రిలోనే కరోనా పేషేంట్లకు చికిత్సలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. భవనంపై నుంచి మట్టి రాలుతుండటంతో ఎప్పుడు కూలిపోతుందోమోననే భయంతో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో పాములు కూడా తిరుగుతుండటంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు.