గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలంగా మారింది. పలు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్ట్ లలో భారీగా వరదనీరు చేరడంతో.. పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. అయితే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామెజీపేట- భూపతిపూర్ గ్రామాల వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లుతుంది. రెండురోజుల క్రింతం షిప్ట్ డిజైర్ కారు ఈ వాగులో కొట్టుకుపోయింది. ఈ కారులో న్యూస్ కవరేజ్‌కు వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ వున్నారు. రాయికల్ మండలంలోని బోర్నపల్లి గోదావరి నదిలో ఉన్న కుర్రులో 9 మంది కూలీలు చిక్కుకున్నారునే వార్తతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
read also: Pakistan: హఫీస్ సయీద్, జేడీయూ ఉగ్రసంస్థ సభ్యుల హత్య
ఈనేపథ్యంలో.. ఈన్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్ళిన జమీర్, కుటుంబ సభ్యుల నుంచి ఓ వార్త రావడంతో.. వెనుతిరిగాడు జమీర్. అయితే ఈ క్రమంలో.. రామోజీపేట వాగు మీదుగా కారులో వస్తుండగా నీటి ప్రవాహం ఎక్కువైంది. వరద ధాటికి జమీర్ ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. దీంతో.. మంగళవారం రాత్రి నుండి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినా కారు ఆచూకి లభ్యం కాలేదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం.. దానికి తోడుగా వర్షం ఏకధాటిగా కురుస్తుండడంతో.. కారు జాడ తెలుసుకోవడానికి కష్టంగా మారడంతో.. రెస్క్యూ ఆపరేషన్ ను నిలిపివేసారు. నిన్న బుధవారం రాత్రి నుండి వరద కొంత తగ్గుముఖం పట్టడంతో.. జమీర్ ప్రయాణిస్తున్న కారు టైర్లు పైకి తేలాయి. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో.. హుటా హుటిన ప్రమాద స్థలానికి చేరుకుని కారును బయటకు తీయించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అయితే కారులోనే జమీర్ చిక్కుకుని ఉన్నాడా? లేదా? అనే విషయం ఇంకా తెలియాల్సి వుంది.