Gym Trainer Case: హైదరాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట జిమ్ ట్రైనర్ జయకృష్ణ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు పోలీసులు. వివాహిత భార్యే జయకృష్ణను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జయకృష్ణ భార్య దుర్గ గత కొంతకాలంగా చిన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని జయకృష్ణను హత్య చేసేందుకు ప్రియుడు చిన్నాతో కలిసి పథకం వేసింది. ఈ పథకంలో భాగంగానే భర్తకు మద్యం తాగించింది. భర్త మద్యం మత్తులో ఉండగానే పెట్రోలు పోసి సజీవ దహనం చేసింది. అనంతరం భర్త మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
Read also: Pakistan: పాక్‌లోని పెషావర్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
అప్పుల బాధతోనే జయకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ నమ్మే విధంగా ఇందులో చిత్రీకరించారు. జయకృష్ణ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ఈ సమయంలో జయకృష్ణ మృతదేహం కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానం వచ్చిన పోలీసులు జిమ్ ట్రైనర్ భార్య దుర్గ, ప్రియుడు చిన్నాను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. భార్యే భర్తను హత్య చేసిందని విచారణలో తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే ప్రియుడు చిన్నాతో కలిసి భర్తను హత్య చేసినట్లు దుర్గ పోలీసుల ఎదుట అంగీకరించింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారిద్దరికీ రిమాండ్ విధించింది.
Pakistan: పాక్‌లోని పెషావర్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
