Site icon NTV Telugu

Sabitha Indra Reddy: నారాయణ కాలేజీకి షోకాజ్ నోటీసులు.. సర్టిఫికెట్లు ఆపొద్దన్న ఇంటర్ బోర్డు

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy: హైదారబాద్‌ లోని రామాంతపూర్‌ నారాయణ కాలేజీ ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో అధికారులు కాలేజీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. CC ఫుటేజ్, అకౌంట్స్ వివరాలని ఇవ్వాలని ఆదేశించారు. అటు కాలేజీని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో టీసీ కోసం విద్యార్థి నిప్పంటించుకున్న ఘటన నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సర్టిఫికెట్లు ఏ కారణంతోనూ ఆపొద్దంటూ కాలేజీలను ఆదేశించిన బోర్డు.. కోర్సు పూర్తైన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో లేదా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది.

ఇక టీసీ విషయంపై సందీప్, ప్రిన్సిపల్​కు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థి ఫీజు విషయం, టీసీ గురించి మాట్లాడుతుండగా సందీప్ ప్రిన్సిపల్​ను బెదిరించేందుకు తనతో తీసుకొచ్చిన పెట్రోల్​ను ఒంటిపై పోసుకున్నాడు. అయితే కృష్ణాష్టమి వేళ వెలిగించిన దీపం పక్కనే ఉండటం వల్ల మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ సుధాకర్​రెడ్డి, ఏవో అశోక్​రెడ్డి గాయపడ్డారు. అయితే.. సిబ్బంది బాధితులను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి సందీప్​ సహా.. ప్రిన్సిపల్ సుధాకర్​రెడ్డి, ఏవో అశోక్​రెడ్డి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఎవరికీ ప్రాణాపాయం లేదని, ముగ్గురూ కోలుకుంటున్నారని పోలీసులు వివరించారు.
Janmashtami: జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి

Exit mobile version