Vemulawada: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు, జంగమ అర్చకులు కలిసి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగే శివ కల్యాణోత్సవ వేడుకలు ఇవాల్టితో ముగుస్తాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఈరోజు, రేపు గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్చిత సేవలను రద్దు చేశారు.
Read also: Insta Reel: ఇన్‌స్టా రీల్ కోసం ఫ్లైఓవర్‌పై కారు ఆపాడు.. రూ.36,000 జరిమానా కట్టాడు..
శివ కళ్యాణ ఉత్సవాలు మొదటి రోజు శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి స్వామివార్ల కల్యాణోత్సవాన్ని ఆలయ వేద పండితులచే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.05 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం దైవసేవ నిర్వహించారు. అనంతరం సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ, వాస్తు హోమం, శివ మహాపురాణ ప్రవచనం నిర్వహించారు. రాత్రి భేరీపూజ, దేవతా ఆవాహన, మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ పూర్ణాహుతి, క్షేత్రపాలక బలి, ధర్మగుండంలో త్రిశూలయాత్ర, రాత్రి ఏకాదశ ఆవరణ, అనంతరం ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శివ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించాలని సూచించారు.
Flipkart: ఖరీదైన ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు డెలివరీ చేసిన ఫ్లిప్ కార్ట్.. ఆపై సారీ అంటూ..?!