NTV Telugu Site icon

Cell Phone: సెల్‌ ఫోన్‌ చిచ్చు.. కూతురుని గొంతు నులిమి చంపిన తండ్రి

Cell Phone

Cell Phone

Cell Phone: రోజూ సెల్‌ పోన్‌ మాట్లాడుతుందన్న కారణంతో కూతురుని తొంగు నులిమి చంపాడు తండ్రి. ఈ ఘటన భాగ్య నగరంలో కలకలం రేపింది. నగరంలోని ముషీరాబాద్‌ పోలీస్టేషన్‌ పరిధిలో యాస్మిన్‌ తల్లిని సాదిక్‌ రెండో వివాహం చేసుకున్నాడు. వీరిజీవితంలో పినతండ్రే యాస్మిన్‌ పాలిట శాపమయ్యాడు. రోజే యాస్మిన్‌ ఫోన్‌లో మాట్లాడుతుండటం గమనించిన సాదిక్‌ ఫోన్‌ మాట్లాడించవద్దని హెచ్చరించాడు. దీంతో యాస్మిన్‌ తన పిన తండ్రి మాటలు అస్సలు పట్టించుకోలేదు. దానికి తోడు ఫోన్‌ మాట్లాడుతూనే ఉంది. దీన్ని గమనించిన సాదిక్‌ ఫోన్‌ మాట్లాడవద్దని చెప్పినా నామాటను పక్కనపెట్టి మాట్లాడుతావా అంటూ కోపంతో ఊగిపోయాడు.

Read also: Jharkhand: శ్రద్ధా వాకర్ తరహాలో భార్య హత్య.. శరీరాన్ని 12 ముక్కలుగా నరికిన భర్త

దీంతో పినతండ్రి సాదిక్‌ ను యాస్మిన్‌ ఎదురించి మాట్లాడింది. తను ఫోన్‌ మాట్లాడటం ఎందుకు మానేయాలని అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో ఆవేశంతో ఊగిపోయాన సాదిక్‌ యాస్మిన్‌ దగ్గర వున్న ఫోన్‌ ను లాక్కున్నాడు. ఒకరినొకరు గొడవకు దిగారు. దీంతో సాదిక్‌ కోపంతో యాస్మిన్‌ ను గొంతు పట్టుకున్నాడు. యాస్మిన్‌ ప్రతిఘటించిన వదల్లేదు సాదిక్‌. చివరకు సాదిక్‌ యాస్మిన్‌ గొంగు నుమిలి చంపేశాడు. యాస్మిన్‌ ఊపిరాడ అక్కడికక్కడే చనిపోయింది. అంతేకాకుండా ఏదో ఘనకార్యం చేసినట్లు నేరుగా తనే ఈహత్య చేసానంటూ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారంకు వెళ్లి లొంగిపోయాడు సాదిక్‌. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి యాస్మిన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఫోన్‌ లో మాట్లాడుతుందనే చంపేశాడా? లేక మరే ఇతర కారణం వల్ల చంపేశాడా? తల్లినే కాకుండా యాస్మిన్‌ ను ఏమైనా బలవంతం చేయబోయాడా? యాస్మిన్‌ అది ప్రతిఘటించినందుకే చంపేశాడా? అనేకోణంలో విచారణ చేపట్టారు.
KA Paul: 30 నిముషాల టైం ఇస్తే ఏపీ అప్పు తీర్చేస్తా!

Show comments