NTV Telugu Site icon

KCR: కేసీఆర్‌కు నోటీసులు.. వివరణకు రేపు లాస్ట్‌..

Kcr

Kcr

BRS Chief KCR: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల కొనుగోలుకు సంబంధించి వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని న్యాయ కమిషన్ గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని జూన్ 15 వరకు గడువు విధించింది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. అందుకు కమిషన్ అంగీకరించలేదు. గడువు ముగిసే విషయాన్ని న్యాయ కమిషన్ అధినేత జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మీడియాకు వెల్లడించారు. దీంతో జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి సమాధానం రాకపోతే కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.జూన్ 16 తర్వాత ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.

Read also: Today Gold Price: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

కమిషన్ మరో లేఖ రాసి మరో డెడ్ లైన్ పెడుతుందా..? లేక నిర్ణీత గడువులోగా సమాధానం రాకపోవడానికి కారణం చూపుతూ సమన్లు ​​జారీ చేస్తుందా..? నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ చర్యలు తీసుకుంటుందా? ఇవీ కొనసాగుతున్న చర్చలు. అయితే కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి అక్కడ నేరుగా విచారణకు అవకాశం ఉంది. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే విద్యుత్ కమిషన్ నేరుగా విచారణకు దిగుతామని సంకేతాలిస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్‌ను నియమించింది. ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్‌ఎస్‌ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావును విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి కాగా.. నేడు మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపడం గమనార్హం.
Nabha Natesh: అబ్భా అనిపిస్తున్న నాభ నటేష్ అందాలు..