NTV Telugu Site icon

Kakatiya University: డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి.. కేయూ విద్యార్థుల ఆందోళన..

Hanumakonda Kakatiya Vunivercity

Hanumakonda Kakatiya Vunivercity

Kakatiya University: హనుమకొండ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ రెండవ గేటు వద్ద విద్యార్థుల ఆందోళన చేపట్టారు. డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలని యూనివర్సిటీ ప్రధాన రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన విద్యార్థుల భవిష్యత్తు మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కీ వ్యతిరేకంగా నినాదాలు చేవారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ ఎక్కారు. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

Read also: Kaushik Reddy: మీ డిమాండ్ లు మీకు తెలియదా?.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై పాడి కౌశిక్‌ రెడ్డి ఫైర్‌

తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 29న DSC నోటిఫికేషన్ 2024ని విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. మొత్తం 11062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరిలో 6,508 మంది ఎస్జీటీలు, 2,629 మంది స్కూల్ అసిస్టెంట్లు, 727 మంది భాషాపండితులు, 182 మంది పీఈటీలు, 220 మంది స్కూల్ అసిస్టెంట్లు, 796 మంది ఎస్జీటీలు స్పెషల్ కేటగిరీలో ఉన్నారు. 537 ఎస్జీటీ పోస్టులు హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 21 మంది మాత్రమే ఉన్నారు.

Read also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఖమ్మం జిల్లాలో అత్యధికంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 176. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 209 ఎస్టీటీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 SGT ఖాళీలు ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా, ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 99 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 161 SGT ఉద్యోగాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్లు ఖాళీగా ఉంటే.. ఎస్జీటీల పోస్టులు 137 ఉన్నాయి.
WhatsApp call Record : వాట్సాప్ కాల్ ఎలా రికార్డ్ చేసుకోవాలంటే..