Site icon NTV Telugu

వణుకుతున్న తెలంగాణ.. పడిపోయిన ఉష్ణోగ్రతలు..

winter in telangana

తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత గత రెండు,మూడు రోజుల నుంచి అధికమవడంతో తెల్లవారుజామున ఇంటినుంచి బయటకు రావాలంటే స్వేటర్‌ లేకుండా సాధ్యంకాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 12గా నమోదయ్యాయి. చలికాలం మొదట్లోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో చలి తీవ్రత ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన ఉష్ణోగ్రతల ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లాలో భీంపూర్‌లో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బజర్హత్నూర్‌, భోథ్‌లలో 12.6, బేలాలో 12.7, గడిగూడలో 12.8, కేరమేరిలో 12.9, తలమడుగు, పొచరలలో 13, సిర్పూర్‌లో 13.1, థాంసీ, రామ్‌నగర్‌లలో 13.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టంగా ఉన్నాయంటూ అధికారులు వెల్లడించారు.

Exit mobile version