NTV Telugu Site icon

Smoke is Snow: చలి తగ్గింది.. పొగ మంచు కుమ్మేస్తుంది..

Smoke Is Snow

Smoke Is Snow

Smoke is Snow: చలి తెలంగాణ రాష్ట్రాన్ని వణికించింది. చలికి రావాలంటేనే జనాలు బెబ్బేలు ఎత్తారు. పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత ఎక్కువైంది. దుప్పట్లు కప్పుకున్న నరాలు తెగే చలి మాత్రం ఆగలేదు. రోజు రోజుకు పెరుగుతూ చలి చంపేసింది. చలికి తోడు పొగ మంచు ఊటీని తలిపించింది. ఒక వైపు చలి మరో వైపు పొగ మంచు, దీంతో.. చలితీవ్రతతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎక్కడ చూసిన ఉదయం అయితే చలిమంటలు వేసుకుని దుప్పట్లు కప్పుకుని చలి కాచుకున్నారు. అయితే రెండు రోజుల నుంచి చలి తీవ్రత కాస్త తగ్గింది. కానీ.. పొగ మంచు మాత్రం కుమ్మెస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవే పై భారీగా పొగ మంచు పేరుకుపోయింది. వాహన దారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. వరంగల్ జిల్లా ఏజెన్సీని పొగమంచు కమ్మేస్తుంది.. ములుగు జిల్లా ఏటూరు, నాగారం, వాజేడు ప్రాంతాలతో పాటు వరంగల్ జిల్లా నర్సంపేట కొత్తగూడ అటవీ ప్రాంతాల్లో పొగమంచు పెరిగింది.

Read also: Stunt Master Suresh: సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. స్టంట్ మాస్టర్ మృతి

ఇక మహబూబాబాద్ జిల్లాను దట్టంగా పొగమంచు కప్పేసింది. దీంతో సమీపం లో ఉన్న వాళ్ళు కూడా కనిపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. 8 దాటినా వాహన దారులు లైట్స్ వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఉదయం ఎనిమిది గంటలు కావస్తున్న పరిసర ప్రాంతాలు కనిపించగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వాహనాలు నడిపే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. రహదారులను పొగ మంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం అయినా ఆ పొగమంచు కారనంగా రోడ్డు కనపడక పోవడంతో.. లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణిస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా ఇంత పొగ మంచు చూడలేదని వారు అంటున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాహనాలు నడపాలి అంటున్నారు.
Elon Musk: వివాదాస్పద వ్యక్తులపై ఎలాన్ మస్క్ ట్విట్టర్ పోల్..