Site icon NTV Telugu

హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు..

ఎన్టీఆర్ పార్క్ ముందు కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ అనే ముగ్గురు యువకులు ఉదయం టిఫిన్‌ చేసేందుకు ఖైరతాబాద్‌ నుంచి అఫ్జల్ గంజ్ బయలుదేరారు. అయితే అతివేగంగా కారు నడుపుతుండగా ఎన్టీఆర్‌ పార్క్‌ ముందు అదుపుతప్పి ట్యాంక్ బండ్ హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి.

అయితే ఈ ఘటనపై సమాచారం అందిన సైఫాబాద్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని గాయాలైన ముగ్గురు యువకులను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గురైన కారు నాలుగు రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version