TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత వారం ప్రమాణ స్వీకారం అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం 14న తేదీ తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఈనెల బీజేపీ, బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న (15వ) తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 16వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శాసనసభ, మండలిలో విడివిడిగా ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఘనస్వాగతం పలికారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్ అభినందనలు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాపాలన మొదలైందన్నారు. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని, కొత్త సీఎం రేవంత్ రెడ్డి తాము పాలకులం కాదు సేవకులం అన్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని తెలిపారు. ప్రజా పాలన మొదలైందన్నారు. ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళుతోందని తెలిపారు.
Astrology: డిసెంబర్ 16, శనివారం దినఫలాలు