NTV Telugu Site icon

Talasani Srinivas: అంబర్పేట్ లో తలసాని.. కాలేరు వెంకటేష్ కి మద్దతుగా ప్రచారం

Kaleru Venkatesh

Kaleru Venkatesh

Talasani Srinivas: హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గం అభ్యర్థి కాలేరు వెంకటేష్ కి మద్ధుతుగా బాగ్ అంబర్పేట్ డివిజన్ లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం చేపట్టారు. అంబర్ పేట నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాలు కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్ పెట్ నా అడ్డా అంటాడు కదా, మరి ఎక్కడ కనిపిస్తాలేడు అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి నియోజకవర్గాన్ని విడిచి పెట్టి ఎందుకు పారిపోయావు చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కాలేరుని గెలిపించాలని ప్రజలను కోరారు. పనిచేసే అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలను కాపాడుకున్నామని చెప్పారు. ఢిల్లీ నుంచి వస్తున్నారు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారని తెలిపారు. ఎలక్షన్ కాగానే 400 రూపాయలుకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం, సన్న బియ్యం ఇస్తాము, సౌభాగ్యలక్ష్మి వస్తుంది అని పేర్కొన్నారు.

మేనిఫెస్టో లో ఇంకో లక్ష ఇల్లు కడతామని సీఎం కేసీఆర్ పెట్టారన్నారు. అందరికి డబల్ బెడ్ రూంలు వస్తాయని తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. అంబర్ పెట్ లో బస్తీ దవఖానాలను పెద్ద ఎత్తున్న ఏర్పాటు చేసామన్నారు. కిషన్ రెడ్డి నీ పార్లమెంట్ పరిధిలో ఎక్కడైనా ఒక్క లక్ష రూపాయిలు పని చేసావా? అని ప్రశ్నించారు. రెండు సీట్లు గెలవని పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బిసిలకు టిక్కెట్లు ఇస్తామని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకి టికెట్ కేటయింపు చేయడమే రాదని అన్నారు. దిక్కు దివాన్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి మూడు నెలలు ముందు అభ్యర్థులను ప్రకటించారన్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ సఫా అయిపోయిందని, ఇక్కడ కాలేరు వెంకటేష్ బంపర్ మెజారిటీ తో గెలవనున్నారని తెలిపారు.
Anantapur: అనంతపురంలో దారుణం.. మ్తెనర్ బాలిక హత్య.. ఎవరు చంపారంటే..!