TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు వయోపరిమితి పెంపు
- 34 నుంచి 44 ఏళ్లకు పెరిగిన గరిష్ట వయస్సు
- తెలుగు మీడియం అభ్యర్థులకు భారీ ఊరట
- వేలాది నిరుద్యోగులకు కొత్త అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో (Pollution Control Board) ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డులో ఖాళీగా ఉన్న ‘అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II)’ పోస్టుల భర్తీ కోసం గత నెలలో TGPSC నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని (Maximum Age Limit) భారీగా పెంచుతూ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని ఇప్పటివరకు ఉన్న 34 సంవత్సరాల నుండి ఏకంగా 44 సంవత్సరాలకు పెంచుతున్నట్లు TGPSC అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యర్థన మేరకు జారీ చేసిన జీవో నంబర్ 86 (G.O.Ms.No.86) ను అనుసరించి, కమిషన్ ఈ 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపును (Age Relaxation) వర్తింపజేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వయస్సు అయిపోయిందని బాధపడుతున్న వేలాది మంది సీనియర్ అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు పోటీ పడేందుకు మరో అద్భుతమైన అవకాశం లభించినట్లయింది.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
ఈ వయోపరిమితి పెంపుతో పాటు అభ్యర్థులకు మరో బిగ్ రిలీఫ్ ఇచ్చింది సర్వీస్ కమిషన్. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే రాతపరీక్షను (Written Exam) కేవలం ఇంగ్లీషులోనే కాకుండా, అభ్యర్థుల సౌకర్యార్థం ఇంగ్లీషుతో పాటు తెలుగు మీడియంలో కూడా నిర్వహించనున్నట్లు TGPSC స్పష్టం చేసింది. దీనివల్ల తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఎగ్జామ్ రాయడం మరింత సులభం కానుంది. ఈ మార్పుల నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు లభించిన అవకాశాన్ని ఉపయోగించుకుని పక్కా ప్లానింగ్తో ప్రిపేర్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..