NTV Telugu Site icon

సరిహద్దుల్లో ప్రైవేట్ వాహనాలు నిలిపివేత… ఇబ్బందుల్లో ప్రయాణికులు

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు కోన‌సాగుతున్నాయి.  క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు లాక్‌డౌన్ ను అమ‌లు చేస్తున్నారు.  ఇక స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు.  తెలంగాణ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన పుల్లూరు టోల్‌ప్లాజా వ‌ద్ద ప్రైవేట్ వాహ‌నాల‌ను నిలిపివేశారు.  ఈ పాస్ ఉంటేనే వాహ‌నాల‌కు అనుమ‌తి ఇస్తున్నారు.  దీంతో టోల్ ప్లాజా వ‌ద్ద ట్రావెల్స్ బ‌స్సులు, కార్లు అనేకం నిలిచిపోయాయి.  పెద్ద సంఖ్య‌లో వాహ‌నాలు ఆగిపోవ‌డంతో ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతున్నారు.   అత్య‌వ‌స‌ర‌, స‌రుకు, అంబులెన్స్ కు మాత్ర‌మే పాస్‌లు లేకున్నా అనుమ‌తిస్తున్నారు.