T Congress: కాంగ్రెస్ పార్టీకి ఫేక్ జాబితాల టెన్షన్.. ఆశావహులు ఆఖరి ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T Congress: కాంగ్రెస్ పార్టీకి ఫేక్ జాబితాతో పార్టీ శ్రేణులకు భయం పట్టుకుంది. 14 మందితో జాబితా విడుదల అంటూ పోస్టులు వైరల్ కావడంతో శ్రేణుల్లో గుబులు నెలకొంది. ఆరు పేర్లతో మరో జాబితా అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మొదటి 14 పేర్లలో మహేశ్వరం ఒకరి పేరు.. రెండో లిస్ట్ లో ఇంకో పేరు ఉండటంతో కాంగ్రెస్ క్యాడర్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆశావహులు కలుస్తున్నారు. ఆఖరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నిజంగానే 14 మందితో జాబితా విడుదల చేశారా? అనే అనుమానాలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పార్టీ శ్రేణులు కలుస్తున్నారు. అసలు ఇలాంటి ఫేక్ జాబితాలను ఎవరు సృష్టిస్తున్నారు?.. ఈ వార్తలపై కాంగ్రెస్ అధిష్టానం సమాధానం కోసం హస్తం నేతలు వేచి చూస్తున్నారు.
ఇటివలే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 55 మందికి స్థానం కల్పించారు. బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్ ఖాయమైంది. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు కూడా టికెట్ దక్కింది. కోదాడ నుంచి ఉత్తమ్ హుజూర్ నగర్, పద్మావతి బరిలోకి దిగుతున్నారు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
భద్రాచలం టికెట్ కమ్యూనిస్టులకే కేటాయిస్తారని ప్రచారం జరిగినా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యకు టికెట్ ఖరారు చేసింది. జానా రెడ్డికి బదులు ఆయన కుమారుడు జయవీర్ ఈసారి నాగార్జునసాగర్ బరిలో నిలవనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, ఎంపీ కోమటిరెడ్డి నల్గొండ నుంచి, భట్టి వికమార్క మధిర నుంచి పోటీ చేయనున్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై తూమకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. జగిత్యాల నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. వామపక్షాలతో పొత్తులో భాగంగా సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం స్థానాలు ఖరారైన సంగతి తెలిసిందే. సీపీఎంతో చర్చలు జరిపి పొత్తును విడనాడి మిగిలిన సీట్లను ప్రకటించాలని కాంగ్రెస్ భావించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫేక్ లిస్ట్ హల్ చల్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Alluri Sitharama Raju district: 34 మందిలో ముగ్గురు మృతి.. భయాందోళనలో గ్రామస్తులు
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!