NTV Telugu Site icon

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత.. DSP రవీంద్రా రెడ్డి తో వాగ్వాదం

Srinivas Sangareddy Crime

Srinivas Sangareddy Crime

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీనివాస్‌ మృతికి పోలీసులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోలన చేపట్టారు. అక్కడకు వచ్చిన సంగారెడ్డి DSP రవీంద్రా రెడ్డితో చిన్నా అలియాస్‌ శ్రీనివాస్‌ కుటుంబ సభ్యుల వాగ్వాదానికి దిగారు. పోలీసులు, వైద్యులే చిన్నా మృతికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శవం కుల్లిపోయేంత వరకు ఆసుపత్రి సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. NTV తో చిన్న భార్య సంగీత మాట్లాడుతూ.. నా భర్తని పోలీసులే చంపేశారని ఆరోపించారు. కచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యంతోనే నా భర్త చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ కాలేదు అని నాకు అనుమానంగా ఉందని అన్నారు ఆమె.

Read also: Mirchi Price: పసిడిని దాటిన మిర్చి రేట్.. ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర

సుల్తాన్ పూర్ లో మాకు బంధువులు ఎవరు లేరని, అటు వైపు ఎందుకు వెళ్ళాడు.. ఎవరో తీసుకుపోయి చంపేశారని కన్నీటి పర్వంతం అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు మాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అంటూ ప్రశ్నించింది. చనిపోయినప్పుడు కూడా ఎందుకు చెప్పలేదని తలిపింది. నాకు న్యాయం చేయండి అంటూ వేడుకుంది. ఆందోళనకరులపై పోలీసుల లాటి ఛార్జ్ చేశారని వాపోయారు. మహిళలను కడుపులో తన్నారని ఆరోపిస్తున్నారు. తాను కడుపుతో ఉన్నానని కొట్టవద్దని ప్రాధేయ పడ్డ మహిళను కూడా వదలకుండా తన్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. న్యాయం చేయాలని కోరారు. దీంతో సంగారెడ్డి రహదారి స్థంబించింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు.

ఏం జరిగింది?

గత నెల 18న సుల్తాన్ పూర్ లో రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ (28) అనే యువకుడు గాయపడ్డాడు. అయితే.. ఇది గమనించి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే.. హాస్పిటల్‌కి తరలించి పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు, 108 సిబ్బంది. గత నెల 18 నుంచి 22 వరకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స అందించారు వైద్యులు.. అయితే.. చికిత్స పొందుతూ డిసెంబర్ 23న శ్రీనివాస్‌ మృతి చెందాడు. శ్రీనివాస్ చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్, పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చామంటున్నారు ఆసుపత్రి వైద్యులు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మార్చురీలోనే శ్రీనివాస్ డెడ్ బాడీ ఉంది. ప్రతి రోజు సమాచారం ఇచ్చినా పోలీసులు రెస్పాన్డ్ కాలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ రోజు డెడ్ బాడీ దుర్వాసన రావడంతో మరోసారి పుల్కల్ పోలీసులకు ఫోన్ చేశారు ఆస్పత్రి సిబ్బంది.

అయితే.. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని.. శవాన్ని మార్చురీ నుంచి బయటికి తీస్తుండగా శ్రీనివాస్ జేబులో నుంచి ఆధార్ కార్డ్ బయటపడింది. ఆధార్ కార్డ్ ఆధారంగా శ్రీనివాస్ ది ఝారసంఘం మండలం కిష్టపూర్ గ్రామంగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఆస్పత్రికి హుటాహుటిన వచ్చిన బంధువులు.. పుల్కల్ పోలీసులు తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన చేపట్టారు. డెడ్ బాడీ తీసుకెళ్లడానికి నిరాకరించిన బంధువులు.. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. డెడ్ బాడీ తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయారు శ్రీనివాస్ బంధువులు.

Show comments