NTV Telugu Site icon

Tension in Karimnagar: హనుమాన్ భక్తుల ర్యాలీలో ఉద్రిక్తత.. ఆరుగురిపై కేసు నమోదు..

Karimnagar Police Hanuman

Karimnagar Police Hanuman

Tension in Karimnagar: కరీంనగర్‌లోని మంచిర్యాల చౌరస్తాలో శనివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలో హనుమాన్ మాలధారులు ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి వచ్చి కత్తితో నృత్యం చేసి ర్యాలీని అడ్డుకున్నాడు. ఆ వ్యక్తితో హనుమాన్ మాల దళారి వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీని నిలిపివేయాలని ఆదేశించారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలంటూ హనుమాన్ దీక్షాపరులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో హనుమాన్ దీక్షాపరులు పోలీసు పెట్రోలింగ్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే హనుమాన్ మాల వేసుకున్న భక్తులను ఎలా అరెస్ట్ చేస్తారు అని పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు.

Read also: Telangana Temperatures: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. 44.9 డిగ్రీలు దాటిపోతోంది..

అయితే పోలీసులు ముందుకు సాగడంతో ఓ హనుమాన్ మాలధారులు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా పోలీసులు అత్యంత వేగంగా ముందుకు సాగి అతడిని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు సమాచారం అందుకున్న బీజేపీ నేతలు నాయక్ 3టౌన్ ఎదుట గుమిగూడారు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. అలాగే పోలీసుల తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక మరోవైపు ప్రాథమిక విచారణలో భాగంగా ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గొడవ జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ లను పోలీస్ లు పరిశీలిస్తున్నారు. అయితే హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వీరంగాన్ని సృష్టించిన వ్యక్తి బీజేపీ కార్యకర్త అని తెలిసింది. స్థానిక బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణ అనుచరుడు జయదేవ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియక బీజేపీ శ్రేణులు వేరే వర్గానికి చెందిన వాడని.. హనుమాన్ భక్తులను హత్య చేసినట్లు సమాచారం.
Hyderabad: ఇంట్లో ఆలౌట్ తాగేసిన 18 నెలల చిన్నారి.. ఆ తరువాత