Tension in Ghazwal: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. నిన్న రాత్రి శివాజీ విగ్రహం ఎదుట ఓ యువకుడు మద్యం మత్తులలో మూత్రం పోయడంతో అక్కడే ఉన్న కొందరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యువకుడు కావాలనే శివాజీ విగ్రహం ఎదుట మూత్రం పోసాడని ఆరోపించారు. అంతేకాకుండా మూత్రం పోసిన యువకుడు ముస్లిం అని కావాలని విగ్రహం ఎదుట మూత్రం పోసాడని మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈవిషయం కాస్త హిందూ సంఘాల నాయకులకు తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ముస్లిం యువకుడిపై హిందూ సంఘాలు దాడి చేసారన్న వార్త సిద్దిపేటలో వ్యాపించడంతో.. అక్కడకు ముస్లిం సంఘాలు చేరుకుని ఘర్షనకు దిగాయి.
Read also: Tamilnadu: ఏడేళ్లలో.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తమిళనాడు!
స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింప జేసిన ప్రయోజనం లేకుండా పోయింది. మూత్రం పోసిన యువకుడిని అదుపులో తీసుకున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా హిందు సంఘాలు మసీదులోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో మసీదుపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎవరో కావాలనే ఈ విధ్వంసాన్ని సృష్టించారని కొందరు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మతం గురించి దాడులు జరగలేదని చెబతున్నారు. అధికారులు స్పందించి దీనికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని వేడుకుంటున్నారు.
Tamilnadu: ఏడేళ్లలో.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తమిళనాడు!