Site icon NTV Telugu

Warangal Collector: వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. మాజీ సర్పంచుల ఆందోళన..

Warangal Sapanch

Warangal Sapanch

Warangal Collector: వరంగల్ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచుల ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన,7 మండలాల మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా E.G.S పనుల పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని ఆందోళన చేపట్టారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచులు బైఠాయించిన ఆందోళన చేపట్టారు. మాజీ సర్పంచులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ సర్పంచులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాజీ సర్పంచ్‌ లను అడ్డుకుని సముదాయించారు. అనంతరం మాజీ సర్పంచ్‌ లు అందరూ కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు. తమ పదవీకాలంలో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌ ల వినతి పత్రంపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు.
Harish Rao: దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయాలి.. ప్రభుత్వానికి హరీష్ రావు మరో డెడ్ లైన్..

Exit mobile version