MNR Medical College: అర్థరాత్రులు పీజీ విద్యార్థినుల గదులకు ఏడీ నారాయణ రావు వస్తున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఏడీని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థినులు చేపట్టిన ధర్నా నాలుగోరోజుకు చేరింది. తమపై అసభ్యంగా AD ప్రవర్తించాడాని స్టూడెంట్స్ ధర్నా చేపట్టారు. AD నారాయణ రావుని సస్పెండ్ చేసేవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో.. సంగారెడ్డి జిల్లా MNR మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. MNR మెడికల్ కాలేజీ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.
Read also: China: డర్టీ డ్రాగన్ .. గల్వాన్ ఘర్షణలో చనిపోయిన సైనికుల పేరుతో వంతెనలు..
తమపై అసభ్యంగా AD ప్రవర్తించాడని, రాత్రి పూట బాలికల గదులకు AD నారాయణ రావును వస్తున్నడని విద్యార్థినిలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి అమ్మాయిన గదులకు రావాల్సి అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. గదులు తలుపులు కొట్టి రూంలోకి వచ్చి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. డ్రస్సింగ్ రూం లోకి రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఏడీ ని తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తే.. కాలేజీ ముందు స్టూడెంట్స్ ధర్నా చేపట్టారు. మూడు రోజుల నుంచి ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడీ ఇంతగా అసభ్యంగా పర్తిస్తున్నా ఎవరు స్పందించడంలేదని మండిపడున్నారు విద్యార్థినులు. ధర్నా చేపట్టి నాలుగు రోజులు అవుతున్నా పై అధికారుల నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. AD నారాయణ రావును వెంటనే సస్పెండ్ చేసేంత వరకు ధర్నా విరమించే సమస్యే లేదని విద్యార్థినులు తేల్చి చెప్పారు. MNR మెడికల్ కాలేజీ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా చేరుకున్నారు. విద్యార్థులను సముదాయించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే AD నారాయణ రావును సస్పెండ్ చేస్తారా? అనే విషయంపై ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది.
Man Kicked Boy : దూలతీరిందా.. కాలితో తన్ని కటకటాల్లోకి వెళ్లావు