NTV Telugu Site icon

Karimnagar Crime: అప్పు తిరిగి ఇవ్వాలని వేధింపులు.. కౌలురైతు మృతి

Karimnagar

Karimnagar

Karimnagar Crime: అప్పుల బాధ భరించలేక ఓ రైతు మృతిచెందాడు. యాజమాని మాటి మాటి కౌలు రైతును వేధించడం వలన ఆవేదన చెందిన రైతు అనారోగ్యానికి గురై చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహంతో కుటుంబ సభ్యులు అప్పు ఇచ్చిన యజమానే కారణమంటూ ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా పీచుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Read also: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పీచుపల్లి గ్రామంలో సోమవారం రోజు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కౌలు రైతు పోతరవేని రాజయ్య యాదవ్ మృతి చెందాడు. అయితే రాజయ్య మృతికి అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు జగ్గారెడ్డి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రాజయ్య మృతదేహంతో జగ్గారెడ్డి ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు రెండో రోజు ధర్నాను కొనసాగిస్తున్నారు. రాజయ్య తీసుకున్న అప్పు విషయంలో జగ్గారెడ్డి హింసించే వాడని, దీంతో రాజయ్య రోజూ మానసికంగా కృంగిపోయేవాడని కుటుంబ సభ్యులు వాపోయారు.

జగ్గారెడ్డి కారణంగానే రాజయ్య అనారోగ్యం బారిన పడి చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పు చెల్లించేందుకు కూడా కౌలు తీసుకొని సేద్యం చేసిన వరి ధాన్యం డబ్బులను కూడా అధికార బలంతో జగ్గారెడ్డి తన అకౌంట్ లో వేయించుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అప్పు విషయమై చివరకు పోలీస్ స్టేషన్ కు కూడా పిలిపించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని జగ్గారెడ్డి ఇంటి ఎదుటే ఉంచుతామని ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు, స్థానికులు ఎంత చెప్పినా వినకుండా కుటుంబ సభ్యులు మృతదేహంతో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
White House: జోబైడెన్‌ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్‌ హౌస్‌పై దాడి

Show comments