BRS Protest: నేడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఇవాళ చార్మినార్ దగ్గర నిరసనలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది తెలంగాణ రాజముద్ర ఎందుకు మార్పు చేస్తున్నారని క్లారిటీ ఇవ్వాలని పేర్కొంది. రాజముద్ర మార్చకూడదంటూ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతీరణం, చార్మినార్ తొలగింపు ఎందుకు మార్పు చేయాలని నిరసనలో ప్రశ్నించనున్నారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు నిచ్చింది. కాకతీయ కళాతోరణాలు, చార్మినార్ లను ఎందుకు తీస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Read also: Israeli Attack : గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. దాడిలో 78 మంది మృతి
ఈ నిరసనలో కేటీఆర్ తో సహా పలువురు బీఆర్ఎస్ మంత్రులు పాల్గొన్నారు. కాగా.. నిన్న తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాలు తీసివేయడానికి నిరసిస్తూ ఖిలా వరంగల్లోని కాకతీయ కళాతోరణం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ రాజుల పాలన దీక్షకు ప్రతీక అయిన కాకతీయ కళా తోరణాన్ని దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తన్నట్టు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Mallu Bhatti Vikramarka: ఒడిశాలో భట్టి విక్రమార్క.. రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం..