తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది ఎస్‌ఎస్‌సీ బోర్డు.. ఆ షెడ్యూల్ ప్రకారం.. మే 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. 20వ తేదీతో పరీక్షలు పూర్తికానున్నాయి.. ఈ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్టు ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటించింది… ఇక, 11న ఫస్ట్ లాంగ్వేజ్, 12న సెకండ్ లాంగ్వేజ్, 13న థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలు ఉండగా.. 14వ తేదీన మ్యాథ్స్, 16న జనరల్ సైన్స్, 17వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహిస్తారు.. ఇక, 18వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్, 19న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2, 20వ తేదీన ఎస్‌ఎస్‌సీ వొకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుందని షెడ్యూల్‌లో పేర్కొంది ఎస్‌ఎస్‌సీ బోర్డు..
Read Also: KCR Warning to BJP: బీజేపీ బిడ్డల్లారా మమ్మల్ని ముట్టుకుంటే నశం చేస్తాం..!
