Site icon NTV Telugu

Komatireddy Rajagopal Reddy: రాజీనామాకు నిమిషాల్లోనే ఆమోదం

Rajagopalreddy

Rajagopalreddy

Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను నిమిషాల్లోనే అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజగోపాల రెడ్డి రాజీనామాను సమర్పించిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపి, అధికారికంగా స్పీకర్‌ కార్యాలయం ప్రకటించింది. అయితే రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. తన రాజీనామాను స్పీకర్‌ పోచారం ఆమోదించారని అన్నారు. స్పీకర్‌ రాజీనామా సమర్పించానని అన్నారు. అయితే.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఆరు నెలల లోపు మునుగోడు ఉప ఎన్నిక రావడం ఖాయమని తెలుస్తోంది. రాజీనామా స్పీకర్‌ తనకు అందిన వెంటనే ఆమోదించడంతో ఇది హాట్‌ టాప్‌ గా మారింది. రాజగోపాల్‌ రెడ్డి స్పీకర్‌ కు రాజీనామా ఇచ్చి బయటకు వచ్చిన కొద్దినిమిషాలకే స్పీకర్‌ ఆమోదం తెలపడంతో పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

read also:Election Commission: వారికి షాకిచ్చిన ఎన్నికల కమిషన్‌.. కోటి మంది ఓట్లు తొలగింపు..!

కాసేపటి క్రితం రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాకు స్పీకర్‌ ఆమోద ముద్ర వేస్తారా అన్న అంశంపై పలు ప్రశ్నలు వచ్చాయి. అయితే మీడియా పాయింట్ తో మాట్లాడిన రాజగోపాల్‌ రెడ్డి ఆమోదం తెలుపకపోతే ఆమోదం తెలిపేంద వరకు పోరాటం చేస్తామని ప్రస్తావించారు. కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వార్దం ఉంటే పార్టీకి రాజీనామా చేయనని స్పష్టం చేసారు. ఉప ఎన్నికలకు ఎవరు పోరు? నన్ను నమ్ముకున్న వల్ల కోసం రాజీనామా చేసా అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. 60 యేండ్ల పోరాటం ఒక కుటుంబం కోసం కాదని విమర్శించారు. అయితే.. రాజగోపాల్‌ రెడ్డి స్పీకర్‌ కు తన రాజీనామా లేఖ ఇచ్చి బయటకు వచ్చే నిమిషాల్లోనే స్పీకర్‌ ఆమోదం తెలిపారు. దీంతో పార్టీ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది.  2018 డిసెంబర్‌లో మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్‌ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.

Exit mobile version