Telangana : సంక్షేమ శాఖలలో పెండింగ్ లో ఉన్న బకాయిలు అన్ని ఒకేసారి విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. విద్య విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం విద్యతోనే సమాజంలో సమూల మార్పులు వస్తాయని భట్టి విక్రమార్క అన్నారు.
Salman Khan: మరో ఆరు రోజుల్లో 60వ పుట్టినరోజు.. ఆ ఫిట్‌నెస్ ఏంటి భాయ్..!
బకాయిలకు విషయానికి వస్తే.. బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన రూ.365.75 కోట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం ఆర్థక శాఖ అధికారుల విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజాభవన్ లో ఆర్థిక, సంక్షేమ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్ట విక్రమార్క సమీక్షా సమీవేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రూ.21.62 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.191.63 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి రూ.152.59 కోట్లు విడుదలయ్యాయి.
GHMC : హైదరాబాద్ వాసులకు గోల్డెన్ ఛాన్స్.. ఆస్తి పన్ను బకాయిలపై బంపర్ డిస్కౌంట్.!1
