తెలంగాణ వ్యాప్తంగా వైన్స్ షాపులకోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు టెండర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎంతో మంది అశావాహులు టెండర్లు దక్కించుకునేందుకు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. అయితే.. సంగారెడ్డి వెన్స్ టెండర్ల లాటరీలో ఓ వ్యక్తి హైట్రిక్ కొట్టాడు. ఏకంగా మూడు వైన్ షాపులను దక్కించుకున్నాడు.
Read Also: Job at Google: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఏకంగా 2.25 కోట్ల ప్యాకేజీతో కొలువు..!
సంగారెడ్డిలో జరుగుతున్న వైన్స్ టెండర్ ప్రక్రియలో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నరసింహగౌడ్, దిలీప్ గౌడ్, ప్రభుగౌడ్ లు కలిసి సిండికేట్ గా మూడు మద్యంషాపులకు టెండర్లు వేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని షాప్ నెంబర్ 82 తడ్కల్, షాప్ నెంబర్ 83 మానూర్, షాప్ నెంబర్ 84 కరస్తుత్తికి సంబంధించి వరుసగా మూడు షాపులకు లక్కీ డ్రా తీయగా టోకెన్ ద్వారా ఆ మూడు షాపులు వీరికి దక్కాయి. వరుసగా మూడు షాపులు రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఒక్కడికే 3 వైన్ షాపులు దక్కి హ్యాట్రిక్ కొట్టాడు.
Read Also:Wife Attacked Husband: ఏందమ్మా ఇది.. భర్త ఇళ్లు క్లీన్ చేయలేదని.. ఆ ఇళ్లాలు ఏం చేసిందో తెలుసా…
సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ సిండికేట్‌గా సంగారెడ్డి పట్టణంలోని మొత్తం 24 షాపులకు టెండర్లు వేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి జెఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఎక్సైజ్ శాఖ లక్కీ లాటరీలో రాజేశ్వర్ గౌడ్‌కి షాప్ నెంబర్ 1, 3, 8 లాటరీ ద్వారా దక్కాయి. అయితే వీరంతా సిండికేట్‌గా సంగారెడ్డిలోని అన్ని షాపులకు కలిపి దాదాపు 100 వరకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ఏకంగా మూడు షాపులు రాజేశ్వర్‌కి దక్కడంతో అతను సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు.
