TGSRTC : రాష్ట్రంలో ఆర్టీసీకి కొత్త ఊపు.. రూ.108.02 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ
- రాష్ట్ర వ్యాప్తంగా RTC బస్ స్టేషన్ల అభివృద్ధికి 108 కోట్ల మంజూరు
- 30 బస్ స్టేషన్లు, కొత్త డిపోల నిర్మాణానికి పరిపాలన అనుమతులు
- ప్రయాణికుల సౌకర్యం, ఉద్యోగుల సంక్షేమంపై RTC దృష్టి
- మహాలక్ష్మి పథకం తర్వాత RTCలో కొత్త ఊపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బస్ డిపోలు నిర్మాణం, పాత బస్ స్టేషన్ల పునరుద్ధరణ, ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.108.02 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మంజూరులో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న 30 బస్ స్టేషన్లు, డిపోలు అభివృద్ధి కాబోతున్నాయి. వాటిలో ముఖ్యంగా మద్గుల్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వేములవాడ, పాల్వంచ, అశ్వరావుపేట, హుస్నాబాద్, గోదావరిఖని, నర్సంపేట వంటి బస్ స్టేషన్లు ఉన్నాయి. కొన్ని చోట్ల కొత్త డిపోలు నిర్మించబడుతుండగా, మరికొన్ని చోట్ల పునరుద్ధరణ, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టబడనుంది.
ఈ ప్రాజెక్టుల అమలుకు కావాల్సిన అన్ని చర్యలు తక్షణమే ప్రారంభించాలని ఆర్టీసీ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. త్వరితగతిన పనులు పూర్తిచేసి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యంగా మారింది. కానీ మహాలక్ష్మి పథకం ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేయడం, కొత్త డిపోలు ఏర్పాటు చేయడం, బస్ స్టేషన్లను ఆధునీకరించడం ప్రారంభించాం. సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం – ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని RTCను మరింత ముందుకు తీసుకెళ్తాం,” అని స్పష్టం చేశారు.
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!