తెలంగాణ పాలి సెట్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి.. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కాసేపటి క్రితమే పాలిసెట్ 2022 ఫలితాలను విడుదల చేశారు.. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జూన్ 30వ తేదీన పరీక్ష నిర్వహించారు.. 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై ఈ ఎంట్రెన్స్ నిర్వహిస్తారు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,13,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 365 పరీక్ష కేంద్రాలలో గత నెల 30న పరీక్ష జరిగింది.. ఇక, ఆ పరీక్షకు 1,04,432 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.. ఇవాళ ఫలితాలను విడుదల చేశారు.. మొత్తంగా పాలిసెట్‌లో 91.62 శాతం హాజరయ్యారు. వీరిలో 75.73 శాతం అనగా 79,038 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.. వారిలో బాలికలు 79.99 శాతం అంటే 38,369 మంది అర్హత సాధించగా.. బాలురు 72.12 శాతం అంటే 40,669 మంది ఉత్తీర్ణత సాధించారు..
పాలిసెట్‌కు సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడానికి మరియు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాడానికి https://polycet.sbtet.telangana.gov.in, https://polycetts.nic.in or www.sbtet.telangana.gov.in అనే వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు అని వెల్లడించారు. ఇక, ఈ సందర్భంగా సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలిపారు.. 18 జులై నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం ఉంటుంది.. ఆగస్టు 15వ తేదీ వరకు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని.. ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయిని వెల్లడించారు.. ఆగస్టు 20వ తేదీ నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్న ఆయన.. జయ శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వేటరినరి, హార్టికల్చర్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా దీనిపై నోటిఫికేషన్స్ విడుదల చేస్తాయని ప్రకటించారు నవీన్ మిట్టల్.
