New Brands : తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపార రంగం మరింత విస్తరించనుంది. మొత్తం 604 కొత్త మద్యం బ్రాండ్లకు అమ్మకాల అనుమతుల కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులు చూస్తే, ఇండస్ట్రీలో పోటీ ఏ స్థాయికి చేరిందో స్పష్టంగా తెలుస్తోంది.
మొత్తం దరఖాస్తులలో 331 రకాల ఇండియన్ మెడ్ లిక్కర్స్ (IML) బ్రాండ్లకు అనుమతులు కోరడం గమనార్హం. దీనితో దేశీయంగా తయారయ్యే మద్యం బ్రాండ్ల వృద్ధికి Telangana కీలక మార్కెట్‌గా మారుతోంది. విదేశీ మద్యం బ్రాండ్లు కూడా భారీగా ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మొత్తం 273 రకాల ఫారిన్ లిక్కర్ బ్రాండ్లకు అమ్మకాల అనుమతి కోరుతూ దరఖాస్తులు సమర్పించబడ్డాయి. గ్లోబల్ లిక్కర్ కంపెనీలు తెలంగాణలో తమ ఉనికిని పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఈ 604 బ్రాండ్లలో 47 కొత్త కంపెనీల నుంచి 386 బ్రాండ్లు, అలాగే 45 పాత కంపెనీల నుంచి 218 బ్రాండ్లు ఉన్నాయి. అంటే కొత్త కంపెనీలు కూడా Telangana లిక్కర్ మార్కెట్లో తమ పాత్రను నిర్మించేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెద్ద స్థాయిలో ఉన్న నేపథ్యంలో, కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఆదాయం మరింత పెరిగే అవకాశముంది. అయితే, ఈ లిక్కర్ అనుమతులపై అధికారుల పరిశీలన, నియంత్రణ చర్యలు కూడా కీలకంగా మారనున్నాయి.
Chiranjeevi: పవన్ కళ్యాణ్ కొడుకు కోసం సింగపూర్ కి చిరంజీవి దంపతులు!
