Site icon NTV Telugu

Telangana Assembly Sessions 2022: నేటితో ముగియనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

Telangana Assembly Sessions 2022

Telangana Assembly Sessions 2022

ఇవాల్టితో తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి.. మూడో రోజు శాసనసభలో కీలకమైన బిల్లులతో పాటు కేంద్రానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇక మూడో రోజు సైతం ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే కేంద్ర విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తూ.. కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరుతూ రెండు తీర్మానాలను ప్రవేశపెడతారు. వాటిపై చర్చించి ఆమోదం తెలుపుతారు. ఇక శాసనసభలో ఏడు బిల్లులపై చర్చించి ఆమోదం తెలియజేస్తారు. ఆ తర్వాత ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ విధానం రాష్ట్ర ప్రగతిపై ప్రభావం, ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై ఉభయ సభల్లో రెండు స్వల్పకాలిక చర్చలు జరుపుతారు. ఈరోజు రాత్రి వరకు సమావేశాలు జరిగే వీలుంది.

read also:East Godavari: పోటెత్తిన గోదావరి.. మొదటి హెచ్చరికకు చేరువగా

ఇక సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఉన్న ఫారెస్ట్‌ కళాశాలను వర్సిటీగా మారుస్తామని గత మార్చిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో.. వర్సిటీకి ప్రత్యేక చట్టం చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.. తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రే ఛాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు, తొలిసారిగా అటవీ వర్సిటీకి సీఎం కులపతి కాబోతున్నారు. ఇక.. తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు 2022 బిల్లు సహా మొత్తం ఏడు బిల్లులను అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Smriti Irani: రాహుల్‌ని టార్గెట్‌ చేసిన స్మృతి ఇరానీ.. వీడియోతో కౌంటర్‌ ఇచ్చిన కాంగ్రెస్‌..

Exit mobile version