NTV Telugu Site icon

మేడారం జాతరకు కేంద్రం నిధులు ఇవ్వాలి

ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ను తెలంగాణ మంత్రులు కోరారు. ఈమేరకు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు బుధవారం దిల్లీకి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. మేడారం జాతరకు ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని, కేంద్రం నుంచి కూడా నిధులివ్వాలని కోరారు. అలాగే ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు చొరవ చూపాలని కోరారు.