Site icon NTV Telugu

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ.. కేంద్రం చేయకపోయినా.. మేమే చేస్తాం..!

Satyavathi Rathod

Satyavathi Rathod

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యవహారం ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది.. అయితే, ఇవాళ బయ్యారం ఉక్కుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌… మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.. ఫ్యాక్టరీ ఏర్పాటు అయితే వేలాదిమందికి ఉపాధి దొరుకుతుందన్న ఆమె… ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.. ఇక, కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోయినా.. మేం త్వరలోనే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు.. 10 లక్షల రూపాయలతో బయ్యారంలో జీమ్ ఏర్పాటు చేస్తామని తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్.. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటాలని పిలుపునిచ్చారు.

Exit mobile version