Law cet Results: తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల లా కోర్సుతోపాటు.. పీజీ లా కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 25న పరీక్షను నిర్వహించారు. 3 సంవత్సరాల లా కోర్సుకు 31,485 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 25,747 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 81 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుతోపాటు. ఎల్‌ఎల్‌ఎంకు 12,207 మంది దరఖాస్తు చేసుకోగా .. వారిలో 10,471 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 85 శాతం మంది హాజరయ్యారు.
Read also: Adipurush 1st Day Collections: ‘ఆదిపురుష్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. క్రేజ్ మాములుగా లేదుగా!
లాసెట్ పరీక్షను తెలంగాణతోపాటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహించారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీపై మే 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఫైనల్ కీతోపాటు ఫలితాలను నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షను నిర్వహించింది. కన్వీనర్‌గా ఓయూ లా డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ విజయలక్ష్మి వ్యవహారించారు.
