Site icon NTV Telugu

తెలంగాణ కరోనా బులెటిన్.. కొత్త కేసులు ఎన్నంటే?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,326 శాంపిళ్లను పరీక్షించగా 160 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,71,623కి చేరగా… మరణాల సంఖ్య 3,958కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 193 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ బారిన పడి ఇప్పటివరకు 6.63 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,974 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Read Also: టీఆర్‌ఎస్ ‘విజయగర్జన‘ సభ వాయిదా.. కారణం అదేనా..?

మరోవైపు తెలంగాణ ఇప్పటివరకు 2.76 కోట్లకు పైగా శాంపిళ్లను వైద్యాధికారులు పరీక్షించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా… కరోనా మరణాల రేటు 0.58 శాతంగా నమోదైంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 59 కేసులు నమోదు కాగా జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

జిల్లాల వారీగా కరోనా కేసులు:

Exit mobile version