Site icon NTV Telugu

Minister KTR: ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి

Minister Ktr

Minister Ktr

ఏనిమదేండ్లలో తెలంగాణ అద్భుత మైన ప్రగతి సాధించిందని పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ పేర్నొ్నారు. హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో ఉన్న టీ-హబ్‌లో జరిగిన డిప్లొమాటిక్‌ ఔట్‌రిచ్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. ఇక 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేది కానీ ఇప్పుడు 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు.

పీఎం మోడీతో జరిగిన సమావేశంలో ఇదేవిషయం చెప్పానని వెల్లడించారు. దేశంలో యంగెస్ట్‌ రాష్ట్రమైన తెలంగాణ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, ఐటీ, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అయితే.. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పాం సాగవుతున్నదని వెల్లడించారు. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల‌, సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయిందన్నారు. ఏకంగా 15 వందలకుపైగా మల్టీనేషన్‌ కంపెనీలు హైదరాబాద్‌లో కొలువుదీరాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇక ప్రపంచంలో భారత్‌ నంబర్‌ వన్‌లో ఉండాలంటే ఇన్నేవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌నెస్‌ అనే మూడు సూత్రాలు పాటించాలన్నారు.
Harassment : అప్పు ఇస్తా.. గెస్ట్‌ హౌస్‌కు వస్తా.. న్యూడ్‌ కాల్‌ చేస్తావా..

Exit mobile version