NTV Telugu Site icon

TS Inter Exams 2024: నో టెన్షన్‌.. నిమిషం నిబంధన తొలగించిన ఇంటర్‌ బోర్డు

Inter Bord

Inter Bord

TS Inter Exams 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే పరీక్ష కేంద్రానికి ఒక్కనిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించడం లేదు. దీంతో విద్యార్థులు కాస్త ఆలస్యంగా వచ్చిన కేంద్రంలోకి అనుమతించడం లేదు అధికారులు. ఎంత ప్రాధేయపడ్డ కనికరం చూపడం లేదు. ఇంటర్మీడియట్ పరీక్ష హాజరు విషయంలో ప్రవేశపెట్టిన మినిట్ నిబంధనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేకపోయారు. దీంతో ఏడాదంతా కష్టపడి చదివి పరీక్ష రాయలేక కన్నీళ్లతో వెనుదిరగాల్సి వచ్చింది. పరీక్షకు అనుమతించకపోవడంతో మనస్తాపం చెందిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. దీంతో.. తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిలిస్తున్నారు. వీటన్నిటికి పరిజ్ఞానంలోకి తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం నిబంధనను సడలించింది. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ని అనుమతించనుంది. ఫలితంగా ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ఉంటుంది.

Read also: Tirupati: ప్రేమోన్మాది ఘాతుకం.. తనను విస్మరించిందని ప్రేయసిపై కత్తితో దాడి

ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ప్రైవేట్ పరీక్షలకు హాజరవుతున్న వారు 58,071 మంది ఉన్నారు. ఈ ఏడాది తెలంగాణలో కూడా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల నేపథ్యంలో పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విధులకు దూరంగా ఉంచేవారు. పరీక్షల్లో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ అందించేందుకు ఇంటర్ బోర్డు ‘టెలి మనస్’ పేరుతో టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు 14416 లేదా 040-24655027కు కాల్ చేయవచ్చు.
Salt Tea Benefits : సాల్ట్ టీని రోజుకు ఒక్కసారి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Show comments