Site icon NTV Telugu

TS Inter Results: సస్పెన్స్‌ కు తెర.. రేపే ఇంటర్ ఫలితాలు

94aa00b6 F0f9 4cfc 97d6 77b54f9e9a78

94aa00b6 F0f9 4cfc 97d6 77b54f9e9a78

తెలంగాణాలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదలకు సన్నాహాలు మొదలయ్యాయి. రేపు మంగళవారం (28వ తేదీన) రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల ప్రకటించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విడుదల ప్రకియ కొనసాగనుంది. కాగా.. ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. 9.07 లక్షల మంది విధ్యార్థులు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఉన్నారు. అయితే ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in అనే వెబ్‌సైట్‌లో విద్యార్థులు చూడవచ్చని అధికారులు వెల్లడించారు.

ఇదిలా వుంటే పదో తరగతి పరీక్ష ఫలితాలను 30న లేదంటే జూలై 1వ తేదీన విడుదల చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కాగా.. జూన్ 25లోగా ప్రకటించాల్సిన ఇంటర్మీడియట్ ఫలితాల తేదీ వాయిదా పడిందని, మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు ధృవీకరించారు. రెండ్రోజుల క్రితమే పేపర్ కరెక్షన్ పనులు పూర్తయ్యాయని, ఫలితాలు కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్నామని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఎట్టకేలకు రేపు ఇంటర్ ఫలితాలను ప్రకటించేందుకు సన్నాహాలు షురూ అయ్యాయి.

RAJIV SWAGRUHA FLATS: నేటి నుంచి షురూ.. ఫేస్‌బుక్‌, యూట్యూట్‌లో లాటరీ లైవ్ స్ట్రీమింగ్

Exit mobile version