Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..

  • తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
  • ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 9 వరకు అవకాశం
  • రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 20 వరకు గడువు
  • రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు చెల్లింపులు
Inter Board

Inter Board

తెలంగాణలో మార్చి 2027లో జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారికంగా విడుదల చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ , ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. అలాగే, కాలేజీకి వెళ్లకుండా నేరుగా హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది.

 

విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9, 2026 వరకు తమ పరీక్ష ఫీజును చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఒకవేళ ఆ గడువులోగా చెల్లించలేని విద్యార్థుల కోసం ఆలస్య రుసుముతో కూడిన గడువులను కూడా ప్రకటించారు. రూ. 100 ఆలస్య రుసుముతో నవంబర్ 11 నుంచి నవంబర్ 20 వరకు, అలాగే రూ. 500 ఆలస్య రుసుముతో నవంబర్ 22 నుంచి నవంబర్ 29, 2026 వరకు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. కాబట్టి విద్యార్థులందరూ ఎలాంటి చివరి నిమిషపు ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణయించిన గడువులోగా తమ కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.