Ration Card Holders: తెలంగాణలో రేషన్ కార్డుదారులందరికీ శుభవార్త.. జూన్ 2 నుంచే ప్రారంభం..
- తెలంగాణలో అమలు దిశగా మరో పథకం..
- జూన్ 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకం..
- రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా రూ. 5 లక్షల భారీ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి 15 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
రేవంత్ రెడ్డి భరోసా..
Also Read
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
- Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!
నేడు మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకంపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. తెలంగాణలో పుట్టడం, ఇక్కడ జీవించడం ఒక వరంగా భావించేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే తమ లక్ష్యమని సీఎం వివరించారు.
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటన…
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం వివరాలను వెల్లడించారు. ఈ పథకం 2026, జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము ఆదుకుంటుందన్నారు.
ప్రపంచంలోనే తొలిసారి..
పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికీ వర్తించేలా ఇంత భారీ స్థాయిలో జీవిత బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. సామాజిక అంతరాలు లేకుండా ప్రతి పౌరుడికి భద్రత కల్పించే ఇలాంటి మహత్తర పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని మంత్రి భట్టి పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబాలు రోడ్డున పడకూడదనే మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, ప్రజలపై ఎలాంటి భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!