Site icon NTV Telugu

సైదాబాద్‌ ఘటనపై సీఎం సీరియస్‌.. బాధితులను ఆదుకుంటాం..

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాప ఘటన విషయంలో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి.. వరుసగా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న నేతలు.. నిందితుడుని పట్టుకోవడానికి ఇంత సమయం పడుతుందా అని నిలదీస్తున్నారు. మరోవైపు.. నిందితుడు రాజు కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌ పెద్ద ఎత్తున జరుగోతంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు అప్రమత్తం చేశారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్.. ఇక, నిందితుడికి మద్యం తాగే అలవాటు ఉండడంతో.. రాష్ట్రంలోని 2200 మద్యం షాపు యజమానులను కూడా అప్రమత్తం చేశారు పోలీసులు.. ప్రతీ వైన్‌ షాపుకు నిందితుడికి సంబంధించిన వివరాలు పంపించారు. మరోవైపు.. ఈ ఘటనపై డీజీపీ, సీపీలతో హోంమంత్రి మహమూద్‌ అలీ సమావేశం నిర్వహించారు.. చిన్నారిపై అత్యాచారం, హత్య కేసుపై సమీక్ష జరిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన విషయంలో సీఎం కేసీఆర్‌ చాలా సీరియస్‌గా ఉన్నారని తెలిపారు.. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన.. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో కేసును విచారణ చేయాలన్నారు.. ఈ ఘటన విషయంలో సీఎం కేసీఆర్‌ బాధపడ్డారని.. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు హోంమంత్రి మహమూద్ అలీ.

Exit mobile version