NTV Telugu Site icon

టి-హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పొన్నం అశోక్ గౌడ్.. వైస్ ప్రెసిడెంట్ గా మొహమ్మద్ ముర్తుజా పాషా ఎన్నికైయ్యారు. సెక్రెటరీగా కళ్యాణ్ రావు, సుజన కుమార్ రెడ్డి నియమితులైయ్యారు. అధ్యక్ష పదవితో పాటు మొత్తం 15 పోస్టులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మెత్తం 4444 మంది న్యాయవాదులు ఓట్లు ఉండగా, 2967 మంది న్యాయవాదులు తమ ఓటు వినియోగించుకున్నారు. కోవిడ్ కారణంగా ఈసారి ఆన్లైన్ లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ఎన్నికలు జరిపారు.