NTV Telugu Site icon

Vinayaka Chavithi 2022: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Vinayaka Chavithi

Vinayaka Chavithi

వినాయక చవితి రాబోతోంది.. ఊరువాడ.. చిన్నా పెద్దా ఉత్సాహంగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, హైదరాబాద్‌కు వినాయక చవితి ఉత్సవాలకు.. నవరాత్రి పూజల తర్వాత నిర్వహించే నిమజ్జనానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. అయితే, వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలిపింది. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని వెల్లడించింది. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని కోర్టు స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అలాగే విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే దుర్గాపూజపై పశ్చిమ బెంగాల్ మార్గదర్శకాలను పరిశీలించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

Read Also: Devineni Uma: గోదావరి తల్లి దయతో బతికి బయట పడ్డాం..