Telangana Health Profile: తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ తో లాభాలెన్నో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక (హెల్త్ ప్రొఫైల్) సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికోసం పైలట్ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా సర్వేను మంత్రి హరీశ్ రావు ములుగు జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా దవాఖాన భవనం, రేడియాలజీ ల్యాబ్, పిడియాట్రిక్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
హెల్త్ ప్రొఫైల్‌తో ఎన్నో ప్రయోజనాలు వున్నాయంటున్నారు నిపుణులు. హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడంలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఒక ఐడీ నంబర్ ఇస్తారు. వారి నుంచి నమూనాలను సేకరించి, 30 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాల ఆధారంగా వారి ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తారు.
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ఈ సమాచారంతో అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. దీర్ఘకాలిక బాధితులను గుర్తించడం, వారికి మెరుగైన వైద్యం అదించడం, క్యాన్సర్ వంటి రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందించడం.. ఇలా అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. వైద్యరంగంలో ఈ పథకం మరో మైలురాయి అంటున్నారు వైద్యరంగ నిపుణులు.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!