Site icon NTV Telugu

అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు టీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్..

ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అధ్య‌క్ష‌త‌న నిన్న జ‌రిగిన కేబినెట్ స‌మావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. రాష్ట్రంలో క‌రోనా కేసులు, వ్యాక్సినేష‌న్‌, థ‌ర్డ్ వేవ్‌, త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించిన కేబినెట్‌.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఈ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు టీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేత ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని, రేపటి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గమ్య స్థానములకు TSRTC బస్సులను నడుపనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటు వంటి లాకడౌన్ నిబంధనలు అనుసరించి, ప్రతి రోజూ ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 6 గంటల లోపున ఈ సర్వీసులు రద్దీకీ అనుగుణంగా నడుపనుంది తెలంగాణ ఆర్టీసీ.

read more : అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు టీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్

అటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటు వంటి లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి రేపటి నుండి ఉదయం 5 గంటలు నుండి సాయంత్రం 7 గంటల వరకు ఇట్టి సర్వీసులు ( బెంగళూరు నకు మినహా) నడుపనుంది. వారాంతంలో కర్ఫ్యూ ఉన్నందున ( అనగా శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల ) బస్ సర్వీసులు ఉండనున్నాయి. మహారాష్ట్రలోని గమ్యస్థానాలకు అక్కడి లాక్ డౌన్ నిబంధనలకు లోబడి మంగళవారము నుండి తెలంగాణ ఆర్టీసీ సర్వీసులు నడుపనుంది.

Exit mobile version