Site icon NTV Telugu

Telangana Govt: నిరుద్యోగలకు సర్కార్ గుడ్‌ న్యూస్‌.. వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు

Revanth Reddy

Revanth Reddy

Telangana Govt: నిరుద్యోగలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ పరీక్షల వయో పరిమితి 44 నుండి 46 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రెండేళ్ల పాటు అమలు చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా జీవో జారీ చేశారు. దీంతో నిరుద్యోగుల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన వయోపరిమితితో తెలంగాణ యువత సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే వయోపరిమితి 44 ఉండటంతో కాస్త నిరాసగా వున్న తెలంగాణ యువత వయోపరిమితి రెండేళ్ల పాటు ప్రభుత్వం అమలు చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. చాలా మంది నిరుద్యోగులు గ్రూప్-1 సహా అనేక పోటీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్రశ్నా పత్రాల లీకేజీల వల్ల, పరీక్షల నిర్వహణ వాయిదా పడుతోంది. దీంతో వయసు పెరిగిపోతుండటంతో కొందరు నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

Read also: Eagle: ఈరోజు నిలబడితే ఈగల్ ని ఆపడం కష్టమే…

దీంతో తెలంగాణ యువత ఆవేశానికి గురై ఎటువంటి సంఘటనలకు పాల్పండకుండా ఉండేందుకు వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా..ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో.. వయసు పెరిగినా, అభ్యర్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు వీలు కలగనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 అదనపు పోస్టులను పెంచిన ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కొన్ని నిబంధనల వల్లే టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమవుతోందన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత చాలా కాలం ఎదురుచూస్తుందని, త్వరలో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ అన్నారు.
Eagle: ఈరోజు నిలబడితే ఈగల్ ని ఆపడం కష్టమే…

Exit mobile version